బెజవాడ రౌడీషీటర్ పండు కొందరిపై దాడి చేస్తున్న వీడియో బయటకు రావడంతో విజయవాడ సీపీ దానిపై స్పందించారు. నిందితుడు దాడి చేస్తున్నప్పుడు తీసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంపేందుకు ప్రయత్నించినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. పండును నగర బహిష్కరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పటమట పీఎస్ పరిధిలో జరిగిన గ్యాంగ్ వార్ కేసులో అరెస్టైన నిందితుడు పండు.. ఇటీవల బెయిల్‌పై విడుదలైనట్లు తెలిపారు. అయితే నిందితుడు జైలు నుంచి వచ్చిన తర్వాత నగర బహిష్కరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి పండుపై నిఘా ఉంచామని సీపీ తెలిపారు. గతంలో పండు కత్తులతో హల్ చేస్తున్న వీడియోలు నగర వాసుల్ని భయపెట్టగా.. తాజా వీడియో బయటకు రావటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందన్నారు.
విజయవాడ నగరంలో సంచలనం రేపిన గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు మరోసారి రెచ్చిపోయాడు. పెనమలూరు పీఎస్ పరిధిలో ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. గ్యాంగ్‌లోని ఓ సభ్యుడిపై కర్రతో దాడి చేశాడు. కత్తితో బెదిరించాడు. ఈ సంఘటనను చిత్రీకరించిన వీడియో.. బయటకు రావటంతో రౌడీషీటర్ పండును పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: