Covid Hospitals: కొవిడ్ బాధితులకు ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రిల్లో 50 శాతం పడకలు కేటాయించాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కృష్ణా జిల్లా అధికారి ఆసుపత్రి యాజమాన్యాలను ఆదేశించారు. జిల్లాలో 10కి పైగా ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స జరుగుతుందన్నారు. కొవిడ్ చికిత్సకు అనుమతులున్న ఆసుపత్రులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే బాధితులకు ఉచితంగా కొవిడ్ చికిత్స అందించాలన్నారు.
ఆరోగ్య శ్రీ కింద 50 శాతం కన్నా ఎక్కువ మంది కొవిడ్ బాధితులు వచ్చినపుడు.. ఆసుపత్రిలో పడకలు ఖాళీ ఉంటే వారికి కేటాయించాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు. 100 పడకలు పైన ఉన్న ఆసుపత్రులు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఆరోగ్య శ్రీ కింద ఆంధ్ర ఆసుపత్రి, భవానీపురం, పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కాలేజీ, నిమ్ర హాస్పిటల్, కామినేని, సన్ షైన్, సెంటిని, టైమ్, లిబర్టీ, విజయాసూపర్ స్పెషాలిటీ, ఆయుష్షు, శ్రీ అను, క్యాపిటల్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స అందుతుందన్నారు.
ఇదీ చదవండి
night curfew in ap: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ వాయిదా.. ఎందుకంటే