ETV Bharat / city

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా.. కేసులెన్నంటే? - కరోనా తాజా వార్తలు

COVID IN AP: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 135 మంది కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ వేరియంట్​కు చెందినవే 50 శాతం ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు.

corona
corona
author img

By

Published : Jul 21, 2022, 7:36 PM IST

Updated : Jul 23, 2022, 12:22 PM IST

COVID IN AP: రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్షలు చేసిన ప్రతి వంద మందిలో 12 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 135 మంది కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఓమిక్రాన్ వేరియంట్​కు చెందినవే 50 శాతం ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు. ప్రతి సోమ, శుక్రవారాల్లో ప్రత్యేక డ్రైవ్​లు చేపట్టి గ్రామ సచివాలయాల్లోనే బూస్టర్ డోస్ వ్యాక్సిన్లను వేస్తున్నామని అధికారులు తెలిపారు. 75 రోజుల్లో 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్​లు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశామని ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్ వెల్లడించారు.

ఆరోగ్యశాఖ కమిషనర్‌ నివాస్‌తో ముఖాముఖి

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 21,566 మంది వైరస్​ బారినపడగా.. మరో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 18,294 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉంది.

  • మొత్తం కేసులు : 4,38,25,185
  • మొత్తం మరణాలు: 5,25,870
  • యాక్టివ్​ కేసులు: 1,48,881
  • కోలుకున్నవారి సంఖ్య: 4,31,50,434

Vaccination India: భారత్​లో బుధవారం 29,12,855 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 200.91 కోట్లు దాటింది. మరో 5,07,360 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 9,71,390 మంది వైరస్​ బారినపడగా.. మరో 2,015 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,11,73,227కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,95,685 మంది మరణించారు. ఒక్కరోజే 7,97,256మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,15,41,150కు చేరింది. ఫ్రాన్స్​లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకింది. 125 మంది మరణించారు.

  • జర్మనీలో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 1,36,624 మందికి వైరస్ సోకింది. 177 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో తాజాగా 1,13,588 మందికి వైరస్​ సోకగా.. 367 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకింది. 125 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 86,067 మందికి వైరస్​ సోకగా.. 157 మంది మరణించారు.
  • జపాన్​లో 81,362 కేసులు నమోదు కాగా.. 33 మంది మరణించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 23, 2022, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.