ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించే నిర్ణయాన్ని తితిదే వాయిదా వేసింది. రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతుండడంతో కొంత కాలం ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనుంది. కరోనా ప్రభావంతో గతేడాది మార్చి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తూ వస్తోంది తితిదే. కరోనా ప్రభావం తగ్గడంతో ఆర్జిత సేవలకు అనుమతించాలని ఇటీవల నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా ప్రభావం పెరుగుతుండడంతో తాజాగా భక్తుల అనుమతి నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ఇదీ చదవండి: పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టులో జనసేన పిటిషన్