Ap corona cases today: రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 25,284 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 5,879 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 856 కేసులు నమోదు కాగా.. తూర్పు గోదావరిలో 823, కడప జిల్లాలో 776, కృష్ణా జిల్లాలో 650 కేసుల చొప్పున నమోదయ్యాయి.
కరోనా నుంచి 11,384 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. కొత్తగా 9 మంది కొవిడ్ బారినపడి మరణించినట్లు వెల్లడించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
Corona cases in India: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో.. 2,09,918 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహమ్మారి కారణంగా ఆదివారం మరో 959 మంది మరణించారు. 2,62,628 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం కేసులు: 4,13,02,440
- మొత్తం మరణాలు: 4,95,050
- యాక్టివ్ కేసులు: 18,31,268
- మొత్తం కోలుకున్నవారు: 3,89,76,122
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం 28,90,986 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 166,03,96,227కు చేరింది.
- ఇప్పటివరకు 166.03 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.
- దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,268గా ఉంది.
- మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 4.43శాతంగా ఉంది.
- రోజూవారీ పాజిటివిటీ రేటు- 15.77శాతం
- వారాంతపు పాజిటివిటీ రేటు- 15.75శాతం
- దేశంలో ఇప్పటివరకు 72.89 కోట్ల కరోనా టెస్టులు చేశారు.
- దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలకు 164.59 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 12.38 కోట్ల డోసులు ఉన్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
అంతర్జాతీయంగా..
Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 20,55,785మందికి కరోనా సోకింది. 5,784 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 37,50,03,884కు చేరగా.. మరణాల సంఖ్య 56,81,217కు పెరిగింది.
- US Corona Cases: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 96,954 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 329 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 75,57,8,076 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2,49,448 కేసులు వెలుగుచూశాయి. మరో 127మంది చనిపోయారు.
- ఇటలీలో 104,065కొత్త కేసులు బయటపడగా.. 235 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా 104,012మందికి వైరస్ సోకగా.. 280 మంది చనిపోయారు.
- అర్జెంటీనాలో తాజాగా 21,570 కరోనా కేసులు బయటపడగా.. 152 మంది బలయ్యారు.
- జర్మనీలో 1,09,029 మందికి వైరస్ సోకింది. మరో 45 మంది మృతి చెందారు.
- బ్రిటన్‌లో మరో 62,399 వేల మంది వైరస్ బారిన పడ్డారు. 85 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: ORDINANCE: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ఆర్డినెన్స్ జారీ