ఏపీ ప్రజలు, సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమొత్తుకుంటున్నారని అన్నారు. తెలంగాణ వస్తే ప్రజలు అడుక్కు తింటారని అప్పట్లో ఏపీ నాయకులు అన్నారని గుర్తు చేశారు. కానీ ఏపీలోనే సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారని నిజామాబాద్ జిల్లాలో తెరాస నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (ts minister Prasanth reddy) ఈ వ్యాఖ్యలు చేశారు.
"కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు పోవట్లేదు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు. రోజు ఖర్చుల కోసం కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు అప్పులు లేకపోతే ఆంధ్రా నడవదు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారు. దేశం మొత్తం బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం మాత్రం భాజపా వాళ్ల కింద మీటర్లు పెట్టాలి"
-ప్రశాంత్‌రెడ్డి, తెలంగాణ మంత్రి
స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని..
నిధుల కోసం కేంద్రం వద్ద జగన్ బిచ్చం ఎత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం(minister perni nani fire on telangana leaders statements) చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో(andhra pradesh) అందరూ కలిసి హైదరాబాద్(hyderabad)ను అభివృద్ధి చేశారని, పాడికుండ లాంటి హైదరాబాద్ ఉన్నా... తెలంగాణ అప్పుల పాలైందని మంత్రి విమర్శించారు. తెలంగాణ నేతల వైఖరి అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లుగా.. ఉందని ఆక్షేపించారు.
కేసీఆర్(telangana CM KCR) తరచూ కేంద్రం వద్దకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. నిధులిస్తే కేంద్రంలో చేరే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని మంత్రి అన్నారు. బయట కాలర్ ఎగరేసి...లోపలికెళ్లి కాళ్లు పట్టుకోవడం జగన్‌కు రాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
పాడికుండ లాంటి హైదరాబాద్ ఉన్నా తెలంగాణ అప్పుల పాలైంది. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. కేంద్ర నిధుల కోసం బిచ్చం ఎత్తుకుంటున్నామని అంటున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు తెలంగాణ నేతల వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. - పేర్ని నాని, రవాణశాఖ మంత్రి
ఇదీ చదవండి:
Minister Gowtham Reddy: '3 మేజర్ ప్రాజెక్టులు, 11 ఫిషింగ్ హార్బర్లకు నిధులు కోరాం'