ETV Bharat / city

భవానీపురంలో డివైడర్​ను ఢీకొట్టిన కంటైనర్​.. క్లీనర్ మృతి - vijayawada road accidents

కంటైనర్ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఈ ప్రమాదం విజయవాడ భవానీపురం సితార కూడలిలో జరిగింది. లారీలో వంట చేసుకునే గ్యాస్ సిలిండర్ లీక్ కావడం ఈ ఘటనకు కారణమైంది.

lorry dash the divider at vijayawada
lorry dash the divider at vijayawada
author img

By

Published : Apr 26, 2021, 11:48 AM IST

విజయవాడ భవానీపురం సితార కూడలిలో కంటైనర్ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కంటైనర్ సితార కూడలి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వైపునకు వెళుతోంది. లారీలో వంట చేసుకుని సిలిండర్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. డ్రైవర్ వెంటనే స్టీరింగ్ వదిలి లారీ నుంచి దూకేశాడు. అదుపు తప్పిన లారీ కూడలిలోని డివైడర్​ను ఢీకొట్టడంతో లారీ క్లీనర్ తీవ్రగాయాలపాలై మృతి చెందాడు. ప్రమాద సమయంలో లారీ వెనుకనుంచి వస్తున్న పాల వ్యాన్ లారీని తప్పించబోయి డివైడర్​ను ఢీకొట్టి పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో అక్కడ వాహనాల రద్దీ ఏర్పడింది. భవానీపురం పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో కంటైనర్​ను అక్కడినుంచి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఓ వైపు కొవిడ్ పరీక్షలు..మరోవైపు క్రికెట్ పోటీలు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.