ETV Bharat / city

కట్టడి ప్రాంతాల్లో నిర్ధరణ పరీక్షలు వేగవంతం

author img

By

Published : Jun 18, 2020, 10:28 AM IST

రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలను ఆరోగ్య కార్యకర్తలు సేకరిస్తున్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ ఈ సేకరణ చేపట్టింది. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సమస్యల్లో ఏది ఉన్నా వారిని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిగా పరిగణిస్తున్నారు.

conona tests in andhrapradesh containment zones

60ఏళ్లు దాటిన వారి ఆరోగ్య వివరాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి, వైరస్‌ సోకిన వారిలో ఎక్కువ మంది ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మృతుల్లోనూ వీరి సంఖ్యే అధికం. దీంతో కరోనా కట్టడి ప్రాంతాల్లో 60 ఏళ్లు దాటిన వారికి వెంటనే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని, వీరి నమూనాలను సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

  • వైద్య, ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం...

* రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు 12 లక్షల మంది

* వీరిలో 60 ఏళ్లలోపు వారు 8,08,409 మంది.

* 60 సంవత్సరాలు, ఆపైన 4,02,371 మంది.

* 60 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులు లేనివారు 45,05,090 మంది.

  • కరోనా కట్టడి ప్రాంతాల్లో ఉన్నవారు...

* 60 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు 70,573 మంది.

* 60 ఏళ్ల లోపు వయసుతో దీర్ఘకాలిక వ్యాధులున్నవారు 1,63,154 మంది.

* 60 ఏళ్లు దాటి దీర్ఘకాలిక వ్యాధులు లేనివారు 6,13,722 మంది.

ఇదీ చదవండి: ఈ పిల్లల క్రియేటివిటీ సూపర్​ గురూ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.