పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకు త్వరగా పరిహారం చెల్లించాల్సి ఉందని.. ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆళ్ల నాని హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి పేర్నినాని సైతం ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాంతంలో పనులు వేగంగా జరుగుతున్నందునా.. ముంపు ప్రాంతాల బాధితులకు పరిహారం, పునరావాస కాలనీల నిర్మాణం చేపట్టాల్సి ఉందని మంత్రి అనిల్ అధికారులకు స్పష్టం చేశారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై పురోగతిని మంత్రికి వివరించారు.
ఇదీ చదవండీ... 'వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని మాటిచ్చారు.. అమలు చేయండి'