ETV Bharat / city

'పాత పింఛన్‌ విధానం అమలు అసాధ్యం.. జీపీఎస్‌లో ఇంకా ఏం కావాలో చెప్పండి'

author img

By

Published : May 24, 2022, 2:55 PM IST

Updated : May 25, 2022, 3:39 AM IST

'పాత పింఛన్‌ విధానం అమలు అసాధ్యం.. జీపీఎస్‌లో ఇంకా ఏం కావాలో చెప్పండి'
'పాత పింఛన్‌ విధానం అమలు అసాధ్యం.. జీపీఎస్‌లో ఇంకా ఏం కావాలో చెప్పండి'

14:52 May 24

సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చలు

పాత పింఛన్‌ విధానం అమలు అసాధ్యం

Ministers Committee On CPS: పాత పింఛన్‌ విధానం అమలు సాధ్యం కాదని సీపీఎస్​పై ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. పాత పింఛను పథకాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించేందుకు చర్చిస్తామంటేనే మంత్రుల కమిటీ తదుపరి సమావేశానికి హాజరవుతామని, లేని పక్షంలో రాబోమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కాంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. ఉద్యోగుల సామాజిక భద్రతకు హామీ లేని గ్యారంటీ పింఛను పథకం (జీపీఎస్‌) ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు. సచివాలయంలో మంగళవారం జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశమైంది. ఓపీఎస్‌ అమలుపై ఉద్యోగ సంఘాలు పట్టుబట్టాయి. అది అమలు కష్టమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. గత ప్రభుత్వంలో ఠక్కర్‌ కమిటీ బేసిక్‌ పేలో 50% పింఛనుగా ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పిస్తామంటేనే అంగీకరించలేదని, ఇప్పుడు జీపీఎస్‌కు ఎలా సమ్మతిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. ఓపీఎస్‌ విధానాన్ని రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అమల్లోకి తెచ్చాయని గుర్తుచేశారు. జీతాలు, పింఛన్ల భారంపై ప్రభుత్వ లెక్కలు వింతగా ఉంటున్నాయని.. ఒక ఏడాది భారీగా పెరుగుతూ, మరో ఏడాది తగ్గిపోతున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో ఎప్పుడో భారం పడుతుందని ఇప్పుడు చెప్పొద్దని సూచించారు. 2006లో పదవీ విరమణ పొందిన నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగికి జీపీఎస్‌ 33శాతం కింద రూ.4,959, 40శాతంతో రూ.6,010 పింఛను వస్తుండగా.. ఓపీఎస్‌ అమలైతే రూ.55వేలు వస్తుందని తెలిపారు. ఇలాగైతే జీపీఎస్‌ ఎలా లాభమవుతుందని ప్రశ్నించారు. 2003 నోటిఫికేషన్‌ ద్వారా నియమితులైన 9,500 మంది ఉద్యోగులకు వెంటనే పాత పింఛను పథకాన్ని అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

ఓపీఎస్‌తో ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుంది. పాత విధానంతో 440 శాతం ప్రభుత్వంపై భారం పడుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే ఓపీఎస్ అమలు చేసినా ఇబ్బంది లేదు. ఉద్యోగులు పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. వచ్చే జీపీఎస్‌లో సీపీఎస్ కంటే 65 శాతం ఎక్కువ పింఛన్‌ అవకాశం. ఉద్యోగుల పింఛన్‌కు మినిమం గ్యారంటీ కోసం జీపీఎస్ తెచ్చాం. రాజస్థాన్‌లో సీపీఎస్ రద్దు రాజకీయ నిర్ణయం. 2030 తర్వాత పాత పింఛన్‌ వల్ల పెనుభారం ఉంటుంది. మార్పు చేర్పులతో జీపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులను జీపీఎస్‌కు ఒప్పించే ప్రయత్నం చేస్తాం.- సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రుల కమిటీ సభ్యుడు

జీపీఎస్‌పై ఆరు ఉద్యోగ సంఘాల నేతలు తమ అభిప్రాయాలను మంత్రులకు వివరించారు. జీపీఎస్ ప్రతిపాదనలు దారుణంగా ఉన్నాయని అన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని వివరించిన ఉద్యోగ సంఘాలు.. అక్కడ 4 లక్షల ఉద్యోగులను ఓపీఎస్‌లోకి తెచ్చారని అన్నారు. అయితే మంత్రుల కమిటీ మాత్రం.. జీపీఎస్‌లో ఇంకా ఏం కావాలో మాత్రమే చెప్పాలని ఉద్యోగ సంఘాలకు సూచించింది.

సంప్రదింపుల కమిటీ జీపీఎస్‌పైనే అభిప్రాయాలు కోరింది. పాత పింఛన్‌ అమలు చేయాలని తేల్చి చెప్పాం. జీపీఎస్‌ ప్రతిపాదనలు సహేతుకంగా లేవని తెలిపాం. సీపీఎస్ రద్దు అని చెబితేనే తదుపరి భేటీకి వస్తామని చెప్పాం. - సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేత

సీపీఎస్‌పై ఠక్కర్ కమిటీ నివేదికను ఉద్యోగ సంఘాలు తోసిపుచ్చాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ ఇప్పటికే ఓపీఎస్ అమల్లోకి తెచ్చాయి. ఓపీఎస్‌పై చర్చిస్తామని చెబితేనే సమావేశానికి హాజరవుతాం. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ పాత జీతాలు వస్తున్నాయి. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేత

ఎర్ర గులాబీలిచ్చి : మంత్రుల కమిటీ సమావేశానికి వెళుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు రెండోబ్లాక్‌ ఎదుట సచివాలయంలో సీపీఎస్‌ ఉద్యోగులు ఎర్ర గులాబీలిచ్చారు. జీపీఎస్‌పైనే చర్చ కొనసాగిస్తే సమావేశాన్ని బహిష్కరించాలని విన్నవించారు. ఓపీఎస్‌ పునరుద్ధరణపైనే పట్టుబట్టాలని కోరారు. సీపీఎస్‌, జీపీఎస్‌లకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సేవకుడిగా ఉండి సాధారణ పౌరుడికన్నా తక్కువ పింఛను తీసుకోవడం ఘోరమని సచివాలయ స్టెనోగ్రాఫర్స్‌, పీఎస్‌ల సంఘం అధ్యక్షుడు ఎర్రన్నయాదవ్‌ తదితరులు వాపోయారు.

* పాత పింఛను ఇవ్వాలనుకుంటే అసలు చర్చలు ఎందుకని అడుగుతున్నామని ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియదాస్‌ ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌ వెంట నడిచామని, ఇప్పుడు మమ్మల్ని సమావేశాలకే పిలవడం లేదని వాపోయారు. సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం మాట తప్పితే రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

* ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుణానిధిమూర్తి మాట్లాడుతూ సీపీఎస్‌, జీపీఎస్‌ విధానాలను ప్రభుత్వం పక్కనపెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఇవీ చూడండి

Last Updated : May 25, 2022, 3:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.