పీజీ, యూజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి ఏకీకృత కౌన్సెలింగ్ విధానం కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్సుల్లో ప్రవేశానికి ఏకీకృత కౌన్సెలింగ్ నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల పరిశీలనకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ పి. శ్యామ్ ప్రసాద్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఎవరికీ నష్టం కలగకుండా కౌన్సెలింగ్ విధానం తెచ్చేందుకు వారంలోగా నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చదవండి
jagan bail: 'జగన్ బెయిల్ రద్దు పిటిషన్'పై.. కీలక పరిణామం!