పీఆర్సీ సాధన సమితి సభ్యులతో.. మంత్రుల కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి 7 గంటల పాటు చర్చలు జరిగాయి. హెచ్ఆర్ఏ శ్లాబుల విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్టు తెలుస్తోంది. మంత్రులతో చర్చల అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ ఆన్లైన్లో మాట్లాడారు. మరికాసేపట్లో మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనున్నారు.
ఇదీ చూడండి: