గాల్వన్ లోయ ఘర్షణలో కర్నల్ సంతోశ్బాబు అసువులు బాసి నేటికి ఏడాది పూర్తవుతోంది. సంతోశ్బాబు వీరమరణం.. ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అయినా వారి గుండెల్లో బాధ కన్నా.. గర్వమే ఎక్కువగా కనబడుతోంది. సంతోశ్ బాబు ప్రాణత్యాగం చేసేనాటికి.. ఆయనకు భార్య సంతోషి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కర్నల్ మరణంతో ఆయన భార్యపై ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు పడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగానికి శిక్షణలో ఉన్న సంతోషి.. భర్త జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నానని చెబుతున్నారు. పిల్లల భవిష్యత్ కోసం ప్రణాళిక వేసుకుంటున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తనకు అండగా నిలుస్తున్నారంటూ.. తన మనోవేదనను ఈటీవీ భారత్తో పంచుకున్నారు.
- ఇదీ చదవండి : Viral: బైక్పై వచ్చి తుపాకీతో హల్చల్