ETV Bharat / city

KCR: 'ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు' - పోలీసుల తీరుపై సీఎం ఆగ్రహం

తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకానిలో ఎస్పీ మహిళ మరియమ్మ (Mariyamma) లాకప్​డెత్​ అత్యంత బాధాకరమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లాకప్​డెత్​కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధరణ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి (Dgp Mahender Reddy)ని ఆదేశించారు.

Cm kcr respond on mariyamma incident
'ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు'
author img

By

Published : Jun 25, 2021, 8:41 PM IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకానిలో ఎస్పీ మహిళ మరియమ్మ (Mariyamma) లాకప్​డెత్​కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి, నిజనిర్ధరణ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)...డీజీపీ మహేందర్ రెడ్డి (Dgp Mahender Reddy)ని ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం స్పష్టం చేశారు.

అత్యంత బాధాకరం...

మరియమ్మ లాకప్​డెత్ అత్యంత బాధాకరమని...ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని ముఖ్యమంత్రి అన్నారు. మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు. కుమారుడు ఉదయ్​కిరణ్​కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ. 15 లక్షల పరిహారం, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షలు ఆర్థిక సాయంగా అందించాలని సీఎస్ సోమేశ్ కుమార్ (CS Somesh Kumar)ను ఆదేశించారు.

భట్టితో కలిసి వెళ్లండి...

ఖమ్మం జిల్లా చింతకానికి వెళ్లి లాకప్​డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీని కేసీఆర్ ఆదేశించారు. మరియమ్మ లాకప్​డెత్ ఘటనలో పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్...ఈనెల 28న స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసన సభా పక్షనేత (భట్టి విక్రమార్క Bhatti Vikramarka)తో కలిసి స్థానిక మంత్రి పువ్వాడ అజయ్​కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్, ఎస్సీ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి రావాలని సూచించారు.

మారాలి...

దళితుల పట్ల సమాజ దృక్పథం మారాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్... ముఖ్యంగా పోలీసుల ఆలోచనా ధోరణి, దళితులు, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని, వాటిని క్షమించబోమని సీఎం స్పష్టం చేశారు.

ఊరుకోం...

దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని, తక్షణమే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. లాకప్​డెత్​కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి... చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదన్న కేసీఆర్... అవసరమైతే ఉద్యోగం తొలగించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: Peddi Reddy: తెలంగాణ మంత్రుల మాటలు సరికాదు: పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.