ETV Bharat / city

బీసీ సంక్రాంతి సభ.. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు - BC Sankranthi Sabha Latest News

విజయవాడలో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న బీసీ సంక్రాంతి సభకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించినట్టు సీపీ తెలిపారు.

CM Jagan to attend BC Sankranthi Sabha
బీసీ సంక్రాంతి సభ.. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
author img

By

Published : Dec 17, 2020, 5:05 AM IST

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న బీసీ సంక్రాంతి సభకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

వాహనాల మళ్లింపులు ఇలా ఉండనున్నాయి..

  • పీఎన్‌బీఎస్‌ నుంచి మచిలీపట్నం, ఏలూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు పీసీఆర్, చుట్టుగుంట, రామవరప్పాడు రింగ్ మీదుగా మళ్లింపు
  • బందర్ రోడ్​లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సిటీ బస్సులు తిరగవు
  • పీసీఆర్‌ వైపు నుంచి బెంజి సర్కిల్ వెళ్లే సాధారణ వాహనాలు డీసీపీ బంగ్లా మీదుగా స్టేట్ గెస్ట్ హౌస్, జమ్మిచెట్టు నుంచి పీవీపీ మాల్ మీదుగా ఎంజీ రోడ్‌లోకి మళ్లింపు
  • ఆర్టీఏ నుంచి రెడ్ సర్కిల్, రెడ్ సర్కిల్ నుంచి శిఖామణి సెంటర్, శిఖామణి సెంటర్ నుంచి వాటర్ ట్యాంక్ రోడ్‌లో వాహనాలకు అనుమతి లేదు.

వీఐపీలకు...

  • బీసీ సంక్రాంతి కార్య‌క్ర‌మానికి వ‌చ్చే వీఐపీ వాహనాలకు గేట్ నెంబర్-2 ద్వారా ప్రవేశం
  • బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు వారి అనుచరులకు గేట్ నెంబర్-3 నుంచి ప్రవేశం
  • డైరెక్టర్ల వాహనాలకు స్వరాజ్య మైదానం, పోలీస్ ఆర్మ్​డ్ గ్రౌండ్​లో పార్కింగ్ ఏర్పాటు
  • కార్యకర్తల, అతిథులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఇష్టమున్నట్టు వాహనాల పార్కింగ్ చేయొద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.