ETV Bharat / city

ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా.. జులై 15 నుంచే - నాడు నేడు తాజా వాార్తలు

ఉపాధ్యాయుల బదిలీలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. విద్యార్థుల అవసరాలే ప్రాతిపదికగా చేపట్టాలని ఆదేశించారు. బదిలీలను ఆన్‌లైన్‌ పద్ధతిలో జులై 15 నుంచి చేపట్టనున్నట్లు అధికారులు ఆయనకు వివరించారు.

cm jagan review on nadu nedu
cm jagan review on nadu nedu
author img

By

Published : Jun 4, 2020, 5:19 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’పై సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 'విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులను నియమించాలి. ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్‌ చేయాలి. అధికారులంతా కూర్చొని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు విధివిధానాలు రూపొందించాలి’’ అని ఆదేశించారు. 2017లో అనుసరించిన పద్ధతుల కారణంగా 7,991 పాఠశాలలకు ఏకోపాధ్యాయుడిని కేటాయించారని, వీటిలో చాలా వరకు మూతపడ్డాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. గతంలో అవలంబించిన విధానాల వల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందని జగన్‌ విమర్శించారు.‘‘పిల్లలు నేర్చుకునే విధానం, ప్రతిభపై నిరంతర అధ్యయనం జరగాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఇది జరగాలి. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనకబడ్డారో గుర్తించి, సమస్యలను అధిగమించేందుకు విధానాలు రూపొందించాలి. ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు అందించేందుకు అధికారులు ఆలోచించాలి. డిజిటల్‌ అభ్యాసం కోసం యాప్‌ను రూపొందించాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్‌ సదుపాయం ఉండాలి.' అని సీఎం ఆదేశించారు.

  • టోల్‌ ఫ్రీ నంబరు..

పాఠశాలల్లో సదుపాయాలపై టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు దీనికి ఫోన్‌ చేసేలా దానిని ప్రదర్శించాలి. పాఠశాలలు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న బల్లలు, ఫర్నిచర్‌, సామగ్రిని పరిశీలించారు. నాడు-నేడు పనుల్లో నాణ్యత ఎలా పెంచాలన్నదానిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున జులై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం.. ప్రభుత్వం అంటే నాసిరకం కాదు..నాణ్యతన్న పేరు రావాలన్నారు. ఇది నా మనసుకు నచ్చిన కార్యక్రమం అని వెల్లడించారు.

  • కేంద్రీయ కొనుగోళ్లతో నాణ్యత

'పదో తరగతి వరకు 5.10లక్షల బల్లలు, ఉపాధ్యాయుల కోసం 89,340 టేబుళ్లు, కుర్చీలు, 72,596 గ్రీన్‌ చాక్‌బోర్డులు, 16,334 అల్మారాలు, 1,57,150 సీలింగ్‌ ఫ్యాన్ల కొనుగోలుకు ఇప్పటి వరకు టెండర్లు ఖరారు చేశాం. పారిశుద్ధ్య సామగ్రి మినహా మిగతా వాటికి రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.144.8 కోట్లు ఆదా అయ్యాయి. కేంద్రీయ కొనుగోళ్ల విధానం వల్ల సమయానికి అందడమేకాకుండా నాణ్యత ఉంటుంది. గోరుముద్ద కింద పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజనం ఏ పాఠశాలలో చూసినా ఒకటే నాణ్యతతో ఉండాలి. కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు మధ్యాహ్న భోజనంపై నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలి' అని సీఎం ఆదేశించారు. ఈనెల 8, 9 తేదీల్లో బూట్లు కోసం విద్యార్థుల కొలతలు తీసుకోనున్నామని, నాడు-నేడు పనులకు సంబంధించిన రూ.533 కోట్లు తల్లిదండ్రుల కమిటీల ఖాతాల్లో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా నిధులు ఖర్చు చేశారని, లాక్‌డౌన్‌ సడలింపులతో గత వారం నుంచి పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు.

ఇదీ చదవండి: రాజకీయ రంగులు కుదరవ్..!: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.