విద్యుత్ శాఖ పనితీరు, వైఎస్‌ఆర్ ఉచిత విద్యుత్ అమలుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రి బాలినేని, గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ సీఎండీ సాయిప్రసాద్, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీధర్, అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. మీటర్ల వల్ల ప్రతి పావుగంటకు విద్యుత్ సరఫరా తెలుసుకునే సౌలభ్యం ఉంటుదని సీఎం తెలిపారు. దీనివల్ల అంతరాయం లేకుండా 9 గంటలు సరఫరా చేయవచ్చన్న జగన్.. ఆ బిల్లు మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రైతులు అదే నగదును విద్యుత్ బిల్లు కింద డిస్కంలకు చెల్లిస్తారని వెల్లడించారు. ఈ విధానం వల్ల మరింత నాణ్యమైన విద్యుత్ అందించే వీలు ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. నియంత్రికలు, మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
రైతులు ఐఎస్‌ఐ ప్రమాణాలు కలిగిన మోటర్లు వినియోగించేలా అవగాహన కల్పించాలని సీఎం జగన్ చెప్పారు. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు బిడ్ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తి కాగానే టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఇదీ చదవండి: