ETV Bharat / city

CM Jagan: కరోనా ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని కేంద్రాన్ని కోరతాం: సీఎం జగన్ - ఏపీలో కరోనా కేసులు

CM Jagan Review On Corona: రాష్ట్రంలో కొవిడ్‌ కట్టడి, వ్యాక్సినేషన్‌పై అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ ప్రికాషన్‌ డోస్‌ వ్యవధి తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఈ వ్యవధి 9 నుంచి 6 నెలలకు తగ్గింపుపై లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

కరోనా ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని కేంద్రాన్ని కోరతాం

author img

By

Published : Jan 17, 2022, 4:45 PM IST

Updated : Jan 18, 2022, 4:07 AM IST

CM Jagan Review On Corona: కొవిడ్‌ టీకా రెండో డోసు తీసుకున్న తర్వాత బూస్టర్‌ డోసు (ప్రికాషస్‌ డోస్‌) పొందేందుకు విధించిన 9 నెలల గడువును 6 నెలలకు తగ్గించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన కొవిడ్‌ నియంత్రణ చర్యలపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో బూస్టర్‌ డోసు పొందేందుకు ఉన్న గడువును తగ్గించడంవల్ల ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, అత్యవసర సర్వీసులు అందించేవారు చాలామందిని కొవిడ్‌ బారి నుంచి కాపాడేందుకు అవకాశం ఉంటుందన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ మేరకు కేంద్రానికి సీఎం లేఖ రాయాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ రెండో డోసు టీకా పంపిణీలో పురోగతి తక్కువగా ఉన్న ఐదు జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్స వివరాలు, అత్యవసర సమయాల్లో ఆస్పత్రుల్లో సేవలు పొందేందుకు ఎవరిని, ఎక్కడ సంప్రదించాలన్న దానిపై ప్రజల్లో అవగాహన కలిగేలా విలేజ్‌ క్లినిక్‌లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో హోర్డింగులు ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘104, 108 సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆరోగ్య కేంద్రాల్లో ఉండే వైద్యులనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. దీనికోసం రూపొందించే యాప్‌ ద్వారా, 108కు ఫోన్‌ చేసినా, ఆరోగ్యమిత్ర చెప్పినా ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో చికిత్స జరిగేలా చూడాలి. ఇందుకు కృత్రిమ మేధ వినియోగంపైనా దృష్టిపెట్టాలి. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇళ్లకు వెళ్లాక వారి ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్‌ఎం ఆరా తీయాలి. 14 కాల్‌సెంటర్‌ పనితీరును పటిష్ఠం చేయాలి. టెలిమెడిసిన్‌ ద్వారా బాధితులకు చికిత్సకు సంబంధించిన సలహాలు, సూచనలు పక్కాగా అందేలా చేయాలి’ అని సీఎం పేర్కొన్నారు.

నియోజకవర్గానికో కొవిడ్‌ సంరక్షణ కేంద్రం: అధికారులు

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక కొవిడ్‌ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ‘మలివిడత కొవిడ్‌ సమయంలో కంటే ఈసారి పడకల సంఖ్య పెంచాం. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు అందుబాటులో ఉన్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లోని సంరక్షణ కేంద్రాల ద్వారా 28 వేల పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 27 వేల క్రియాశీలక కేసులు ఉన్నాయి. ఇందులో 1,100 మందే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలోనూ 600 మంది మాత్రమే ఆక్సిజన్‌ అవసరమైన వారు ఉన్నారు. గతంలో ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేసేందుకు 14 రోజుల సమయం పట్టేది. ఇప్పుడ[ు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వారం రోజుల్లోనే డిశ్ఛార్జి చేస్తున్నాం. కొవిడ్‌ లక్షణాలు లేని వారికి నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని కేంద్రం తెలిపింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్యన ఉన్న వారికి నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాలో నూరు శాతం టీకాలిచ్చాం. మరో ఐదు జిల్లాల్లో 90%, మరో నాలుగు జిల్లాల్లో 80% వరకు పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో టీకా పంపిణీని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని (వైద్యం), ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

విద్యాసంస్థలు తెరిచాం.. విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆందోళన అక్కర్లేదు: సురేశ్‌

Last Updated : Jan 18, 2022, 4:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.