ETV Bharat / city

AP Governor: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ను పరామర్శించిన సీఎం జగన్ - treatment to ap governor biswabhusan at aig

ముఖ్యమంత్రి జగన్​.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​తో ఫోన్​లో(CM Jagan talk to governor biswabhusan) మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని(ap governor tested covid positive) ఆకాంక్షించారు. తన ఆరోగ్యం మెరుగవుతోందని గవర్నర్​ బిశ్వభూషణ్‌ తెలిపారు.

CM Jagan phone call to ap Governor
CM Jagan phone call to ap Governor
author img

By

Published : Nov 18, 2021, 3:36 PM IST

Updated : Nov 18, 2021, 6:16 PM IST

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్​ను ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్​తో ఫోన్‌లో(CM Jagan talk to governor biswabhusan) మాట్లాడిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. బుధవారమే వైద్యులతో గవర్నర్​ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడినట్లు చెప్పారు. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని గవర్నర్‌కు సీఎం వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు(ap Governor Biswabhusan Harichandan news) పేర్కొన్నారు. తన ఆరోగ్యం మెరుగవుతోందని గవర్నర్​ బిశ్వభూషణ్‌ తెలిపారు.

హెల్త్‌ బులెటిన్‌ విడుదల..

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. గవర్నర్‌ను నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.

గవర్నర్‌ దంపతులకు కొవిడ్​..

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లు కొవిడ్‌ బారిన(ap governor biswabhusan and wife tested covid positive) పడ్డారు. ఇటీవల దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్‌ రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో గవర్నర్‌ దంపతులకు ఈ నెల 15న ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైంది. హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)కి వారిని తరలించాలని రాజ్‌భవన్‌ మంగళవారమే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రక్రియ వెంటనే కుదరకపోవటంతో రాజ్‌భవన్‌ వర్గాలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాయి. వారు బుధవారం హుటాహుటిన సైనిక విమానాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పంపించారు. ఆ ప్రత్యేక విమానంలో గవర్నర్‌ దంపతులు మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీకి అంబులెన్సులో(ap governor tested covid positive) వెళ్లారు.

ఆరోగ్యం నిలకడగా ఉంది: ఏఐజీ ఆసుపత్రి

88 ఏళ్ల వయసున్న గవర్నర్‌కు కొవిడ్‌(ap governor biswabhusan suffering with covid) మధ్యస్థ లక్షణాలు ఉండడం, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ప్రత్యేక నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, ఆక్సిజన్‌ స్థాయిల్లో ఎలాంటి ఇబ్బందీ లేదని బుధవారం సాయంత్రం ఏఐజీ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. గవర్నర్‌ సతీమణికి కొవిడ్‌ సోకినప్పటికీ ఆమెలో స్వల్ప లక్షణాలే ఉన్నాయి.

రాజ్‌భవన్‌లో మరో పదిమందికి

రాజ్‌భవన్‌లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు, గవర్నర్‌ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కొవిడ్‌ సోకింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పనిచేసే సిబ్బంది అందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి..

CM Review: భారీ వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష

Last Updated : Nov 18, 2021, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.