ETV Bharat / city

CM Jagan Wishes: తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న సీఎం జగన్​ దంపతులు

CM JAGAN IN PONGAL CELEBRATIONS: తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. తాడేపల్లిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకలలో సీఎం జగన్​ దంపతులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతితో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ తెలిపారు.

CM Jagan Wishes
CM Jagan Wishes
author img

By

Published : Jan 14, 2022, 12:53 PM IST

Updated : Jan 14, 2022, 2:17 PM IST

తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

PONGAL CELEBRATIONS AT TADEPALLI: రాష్ట్రవ్యాప్తంగా భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. తాడేపల్లిలోని సీఎం నివాసం సమీపంలోని గోశాల వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో సీఎం జగన్​ దంపతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగల ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. అందరికీ శుభాలు జరిగాలని కోరుకున్నారు. పల్లె వాతావరణం తలపించేలా చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి, ఆయన సతీమణి భారతి ఆసక్తిగా చూశారు. సంక్రాంతి పాటలకు నృత్యాలు చేసిన కళాకారులు, పాటలు పాడిన గాయకులు మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్‌ను అభినందించారు.

మన సంస్కృతి, సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి ఈ పండుగ నిదర్శనమన్నారు. వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీకగా అభివర్ణించారు. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో.. ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి..

BHOGI CELEBRATIONS: ఘనంగా భోగి సంబరాలు.. కళకళలాడుతున్న తెలుగు లోగిళ్లు

Last Updated : Jan 14, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.