Ugadi Celebrations at CM Camp Office: శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది నవరత్నాలకు ఉపరత్నాలు వస్తాయేమో అని పంచాగకర్త వ్యాఖ్యానించారు. శుభకృత్ నామ సంవత్సరాది వేడుకల్లో భాగంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వం తరఫున పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ దంపతులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కప్పగంతు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. ప్రజలు సంతృప్తి చెందేలా ఈ ఏడాది పాలన ఉటుందని, గ్రహాలు అందుకు అనుకూలిస్తున్నాయని చెప్పారు.
అనంతరం సుబ్బరామ సోమయాజులు..సీఎం దంపతులకు ఉగాది పచ్చడి అందించారు. ఆ తర్వాత నూతన పంచాంగాన్ని, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగాన్ని జగన్, భారతి ఆవిష్కరించారు. తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నవరత్నాలపై ఏర్పాటు చేసిన... కూచిపూడి నృత్యప్రదర్శనను సీఎం దంపతులు వీక్షించారు.
ఇదీ చదవండి: