ETV Bharat / city

'స్వార్ధప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం జరుగుతోంది' - cm jagan latest news

రాష్ట్రంలో ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటనల్లో ప్రభుత్వం, పోలీసులు, కలెక్టర్లు ఎంత బాగా స్పందించినా స్వార్ధప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్పందన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్
సీఎం జగన్
author img

By

Published : Aug 25, 2021, 10:22 PM IST

ఇటీవల రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర ఘటనల్లో ప్రభుత్వం, పోలీసులు, కలెక్టర్లు ఎంత బాగా స్పందించినా స్వార్ధప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్పందన వీడియో కాన్ఫరెన్సులో వారితో మాట్లాడిన సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై బురద జల్లాలని ఆరాటపడే వ్యవస్ధను మనం చూస్తున్నామని ఆయన అన్నారు. కొందరు స్వప్రయోజనాల కోసం చేయకూడనివి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి దారుణమైన పరిస్ధితులను చూసి ఒక్కోసారి బాధకలుగుతోందని సీఎం వ్యాఖ్యానించారు. మహిళలు, పిల్లలు, వారి కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతోందని తెలిసినా రాజకీయం చేస్తుండటం శోచనీయమని అన్నారు.

ఈవ్‌టీజింగ్‌ కేసులో కానిస్టేబుల్‌ సస్పెండ్‌ అయితే ఆ కేసులోని బాధితురాలితో పాటు ఆమె కుటుంబం ప్రతిష్టదెబ్బతినేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిని కూడా రాజకీయం చేయడం తగదని అన్నారు. ఈ తరహా ఘటనల్లో కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ తరుణంలో కలెక్టర్లు అప్రమత్తంగా పనిచేయాలంటూ సూచించారు.

ఇదీ చదవండి: corona: బొబ్బిలిలో 10 మంది విద్యార్థులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.