ETV Bharat / city

సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టపరచాలన్న సీఎం జగన్ - కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

CM Jagan On Secretariat System రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టపరచాలని అక్టోబర్ నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన స్పందనను ప్రభుత్వ ప్రాధాన్యాంశంగా భావించి ప్రతిరోజూ నిర్వహించాలని సూచించారు. సచివాలయాల్లో ప్రతిరోజూ అధికారులు, సిబ్బంది రెండుగంటల పాటు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టపరచాలన్న సీఎం జగన్

author img

By

Published : Aug 23, 2022, 9:45 PM IST

Updated : Aug 24, 2022, 6:31 AM IST

సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టపరచాలన్న సీఎం జగన్

Secretariat System In AP: ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలోనూ స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాదించిన ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు చొప్పున మొత్తం రూ.3 వేల కోట్లు కేటాయించామని, ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. ‘గడప గడపకు..’ కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాల్సిందేనని, విధిగా ప్రతి నెలలో, ప్రతి నియోజకవర్గంలో 6 సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. ఆ కార్యక్రమాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి మంగళవారం వీడియో సమావేశంలో సమీక్షించారు. వివిధ అంశాలపై అధికారులకు జగన్‌ ఇచ్చిన ఆదేశాలు, సూచనలు ఇవీ..!

ప్రతి మహిళ మొబైల్‌ ఫోన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాలి. యాప్‌ పనితీరును 15 రోజులకోసారి పర్యవేక్షించాలి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదకద్రవ్యాల వినియోగం, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టాలి.
ఫిర్యాదు చేయడానికి ప్రతి కాలేజీ, యూనివర్సిటీల్లో ఒక ఎస్‌ఈబీ నంబర్‌ను ప్రదర్శించాలి.

ఉపాధి హామీ కూలీలకు సగటు వేతనం రూ.240 ఉండాలి: ఉపాధి హామీ పనుల్లో మంచి పురోగతి ఉంది. ప్రస్తుతం సగటున ఉపాధిహామీ వేతనం రూ.205 అందుతోంది. దాన్ని రూ.240కి పెంచాలి.

* సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, హెల్త్‌ క్లినిక్‌ల భవనాలు, ఆంగ్ల మాధ్యమం స్కూళ్లూ గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి. అక్టోబరు 31కి వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.

* వచ్చే డిసెంబరు నాటికి 4,500 గ్రామాలకు ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ చేరుతుంది. 3,966 గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలు మంజూరయ్యాయి. వాటి నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలి.

నాడు-నేడు పనులు నాణ్యంగా ఉండాలి: రెండో విడత కింద 22,279 ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు నాణ్యంగా ఉండాలి. అక్కడక్కడా మిగిలిపోయిన స్కూళ్లలోను ఈ నెలాఖరుకి పనులు ప్రారంభమవ్వాలి. ఆసుపత్రుల్లో జరుగుతున్న పనులపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కలెక్టర్లు ప్రతి వారం వాటి పురోగతికి సంబంధించిన వివరాలు తెప్పించుకుని, సమస్యలుంటే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలి.

స్కూళ్లలోనూ ఫిర్యాదులకు ప్రత్యేక నెంబర్‌: పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు ప్రతి స్కూల్‌, ఆసుపత్రిలో ప్రత్యేక నంబర్‌ను ప్రదర్శించాలి. ఫిర్యాదులపై వెంటనే స్పందించి మరమ్మతులు చేయించాలి. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్‌, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో 16 వైద్యకళాశాలల నిర్మాణ పనుల్నీ కలెక్టర్లు నిరంతరం పరిశీలించాలి.

వేగంగా ఇళ్ల నిర్మాణం: ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. విశాఖలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణంపైనా, 10 వేలకుపైగా ఇళ్లు నిర్మిస్తున్న లేఅవుట్‌లపైనా శ్రద్ధ పెట్టాలి.

* ఇప్పటి వరకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందాయా? లేదా? వారికి స్థలం అప్పగించామా? లేదా? అన్నది ఒకసారి పరిశీలించాలి. అవసరమైతే వారికి భూసేకరణ చేసి పట్టాలు ఇవ్వాలి. ఇళ్ల పట్టాలు కార్యక్రమాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

2,000 గ్రామాల్లో అక్టోబరు 1కి భూహక్కు పత్రాలు: జగనన్న భూహక్కు-భూరక్ష పథకం చరిత్రలో ఒక అధ్యాయం సృష్టిస్తుంది. అక్టోబరు 1 నాటికి 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాలు అందజేయాలి. అక్కడి నుంచి ప్రతి నెలా వెయ్యి గ్రామాలు చొప్పున భూ హక్కు పత్రాలు ఇవ్వాలి.

ప్రతి రోజూ స్పందన: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన కార్యక్రమం కచ్చితంగా జరగాలి. ప్రతి సోమవారం జిల్లా, డివిజన్‌, సబ్‌డివిజన్‌, మండల స్థాయిలో విధిగా జరగాలి. సంబంధిత అధికారులంతా కచ్చితంగా పాల్గొనాలి. స్పందన వినతులపై కలెక్టర్లు ప్రతి బుధవారం సమీక్షించాలి. ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లతో సమీక్షించాలి.

* నేతన్న నేస్తం కింద గురువారం, వైఎస్‌ఆర్‌ చేయూత కింద వచ్చే నెల 22న లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తాం.

ఇవీ చూడండి

Last Updated : Aug 24, 2022, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.