కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందన్న ప్రధాని మోదీ ప్రకటన పట్ల ముఖ్యమంత్రి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ప్రధాని నిర్ణయం ప్రశంసనీయమని కొనియాడారు. కొవిడ్‌పై పోరాటంలో మన చేతిలో ఉన్న ఒకే ఒక్క అస్త్రం వ్యాక్సిన్ అని అన్నారు. ఇంతకాలం వ్యాక్సిన్లపై ఉన్న సందిగ్ధతను తొలగించారని.. అందరికీ టీకాలు ఇచ్చేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి..
సంగం డెయిరీని ఏమీ చేయలేక తప్పుడు కేసులు పెడుతున్నారు : లోకేశ్