అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM JAGAN) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు(MP RAGHURAMA) దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది. తాను షరతులు ఉల్లంఘించలేదని.. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని సీఎం జగన్ గత నెల 1న కౌంటరు దాఖలు చేశారు. చట్టప్రకారం, విచక్షణ మేరకు కోర్టు దీనిపై తగు నిర్ణయం తీసుకోవాలని సీబీఐ(CBI) మెమో దాఖలు చేసింది.
కౌంటరులో జగన్ పేర్కొన్న అంశాలపై సమాధానం ఇస్తూ గత నెల 14న రఘురామకృష్ణరాజు(RRR) రిజాయిండర్ దాఖలు చేశారు. పిటిషన్ వేసినందుకు తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఇతర నిందితులు, సాక్షులుగా ఉన్న అధికారులకు ప్రయోజనాలు కల్పించారని ఎంపీ పేర్కొన్నారు. దీనిపై తదుపరి వాదనల కోసం కోర్టు పిటిషన్ను నేటికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: