ETV Bharat / city

చేనేతల ఖాతాల్లోకి.. వైఎస్సార్​ నేతన్న నేస్తం నిధులు - ysr netanna hastam

వైఎస్సార్​ నేతన్న నేస్తం మూడో విడత నిధులను నేడు సీఎం జగన్​ విడుదల చేయనున్నారు. 80,032 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 192 కోట్లు నేరుగా జమకానున్నాయి.

వైఎస్సార్​ నేతన్న నేస్తం నిధులు
వైఎస్సార్​ నేతన్న నేస్తం నిధులు
author img

By

Published : Aug 10, 2021, 3:50 AM IST

వైఎస్సార్​ నేతన్న నేస్తం పథకం మూడో విడత నిధుల్ని సీఎం జగన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాళ జమ చేయనున్నారు. చేనేతలకు ఆర్ధిక సాయంగా రూ. 24 వేల వేయనున్నారు. మూడో విడత కింద.. 80వేల 32 మంది ఖాతాలకు.. రూ. 192 కోట్లు నేరుగా జమ కానున్నాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం నగదును లబ్ధిదారుల ఖాతాలకు వేయనున్నారు. అర్హులైన నేతన్నలు ఇప్పటి వరకూ 72 వేల రూపాయల లబ్ధి పొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గడచిన రెండేళ్లలో నేతన్న నేస్తం కింద చేనేతల కుటుంబాలకు రూ. 383 కోట్ల 99 లక్షల ఆర్థిక సాయం అందించినట్టు తెలిపింది. చేనేతలకు మూడు విడతల్లోనూ రూ. 576 కోట్లను అందించినట్టు స్పష్టం చేసింది. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని నేతన్నలు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:

CBN: తప్పుడు లెక్కలతో అప్పులు.. మైనింగ్​ ఆధాయం పక్కదారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.