విజయవాడ నగర శివారు రాజీవ్‌నగర్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి హంగామా చేశాడు. సమాచారం తెలుసుకున్న నున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతనికి మైక్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి కిందకు దించారు. ఆ వ్యక్తి స్థానికంగా నివాసముండే రిక్షాపుల్లర్ సుబ్బారావుగా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. భార్య, పిల్లలు వదిలేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సుబ్బారావు తెలిపారు.
ఇదీ చదవండీ... విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం