ETV Bharat / city

CJI at IAMC Hyderabad Inauguration: 'రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర'

IAMC Hyderabad Inauguration: తాను అడగగానే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని(ఐఏఎంసీ) హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ కీలకపాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్​ నానక్​రామ్​గూడ ఫొనిక్స్ వీకే టవర్​లో ఏర్పాటు చేసిన ఐఏఎంసీ కేంద్రాన్ని సీఎం కేసీఆర్​తో కలిసి ప్రారంభించారు.​

c
c
author img

By

Published : Dec 18, 2021, 12:58 PM IST

'రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీది కీలకపాత్ర'

IAMC Hyderabad Inauguration : ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగకీరించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో మంచి వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రాన్ని (ఐఏఎంసీ) జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు.

IAMC Hyderabad Inauguration : దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్‌ వీకే టవర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్నిసుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్పగించారు. అనంతరం ఐఏఎంసీలో వసతులను పరిశీలించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీని ప్రారంభించి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.

International Center for Arbitration and Mediation Hyderabad : దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్​లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.

CJI Inaugurated IAMC Hyderabad : ఫొనిక్స్ వీకే టవర్​లో 25వేల చదరపు అడుగుల్లో ఈ కేంద్రం ఏర్పాటైంది. సీఎం కేసీఆర్ ఐఏఎంసీ వెబ్​సైట్​ను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లి, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

Shops Close For CM Tour: తణుకులో సీఎం పర్యటన.. దుకాణాలు మూసేయాలని ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.