'పలాస' సినిమాలోని పాటకు వచ్చినంత ఆదరణ తమ సైబర్ క్రైం అవగాహన కార్యక్రమాలకు రావాలని సీఐడి ఏడీజీ సునీల్ కుమార్ అన్నారు. వినోదానికి అవసరమైన పాటను 6 కోట్ల మంది చూశారని.. కానీ విజ్ఞానానికి సంబంధించిన 'ఈ రక్షా' అవగాహన కార్యక్రమాన్ని ఇప్పటికి 4 లక్షల మందే చూశారన్నారు. ఈ కార్యక్రమాన్ని 6 కోట్ల మంది చూసే విధంగా చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఈ రక్షలో చెబుతున్న విషయాల వల్ల హాకర్ల బారిన పడకుండా మనం జాగ్రత్త పడొచ్చని తెలియజేశారు. దీనివల్ల మీ నగదుకు, వ్యక్తిగత సమాచారానికి భద్రత ఉంటుందన్నారు.
ఇదీ చదవండి :