మతపరమైన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు వెచ్చించడం సరికాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయా మతాలకు చెందిన ప్రార్థన మందిరాల పరిధిలోని నిధులనే వాటి నిర్మాణాలు, అభివృద్ధికి వినియోగించాలి తప్ప.. ప్రభుత్వ నిధులతో చర్చిలు, మసీదులు వంటివి నిర్మించడాన్ని తప్పుపడుతున్నామని అన్నారు.
విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో కొందరు పాస్టర్లు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సోము వీర్రాజు ఆహ్వానం పలికారు. భాజపా హిందువుల పార్టీగా చేస్తున్న ప్రచారం సరికాదని సోము వీర్రాజు అన్నారు. పాస్టర్లు తమతో కలిసి పని చేస్తున్నారని పేర్కొన్నారు. మతం వ్యక్తిగతమైందని.. అంతకంటే ముందు అంతా భారతీయులం అనే ధోరణి ముఖ్యమని సూచించారు. ఇతర రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుకు అనుగుణంగా పని చేస్తున్నాయని.. భాజపా ఒక్కటే దేశం కోసం పని చేస్తోదని చెప్పారు. భాజపా ఒక మతానికి, ఒక కులానికి చెందినది కాదని.. సకల జనుల పార్టీ అని తెలిపారు. హిందూత్వం జీవనం విధానం మాత్రమేనని వివరించారు.
ఇదీ చదవండి: