పేదలకు ఇళ్ల స్థలాల కోసం లక్షల ఎకరాల్లోని అడవులనే నరికేస్తారా? అని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నిలదీశారు. ప్రభుత్వం దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తోందని... పంట చెరువులు, వర్సిటీ భూములను తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. నివాసయోగ్యంకాని భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడమేంటనీ ప్రశ్నించారు.
మడ అడవుల నరికివేత సరికాదు: చినరాజప్ప - మడ అడవుల నరికివేతపై తెదేపా నేతల కామెంట్స్
కాకినాడ సముద్రతీరానికి రక్షణగా నిలిచే మడ అడవుల నరికివేత సరికాదని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అభిప్రాయపడ్డారు. నివాసయోగ్యం కానీ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడమేంటని ప్రశ్నించారు.
chinnarajappa on jagan govt