ETV Bharat / city

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండించిన చైనా - చైనా రాయబార కార్యాలయం

భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ ఈ నెల 5న హైదరాబాద్​లోని ధూల్​పేటలో చేసిన నినాదాలను చైనా రాయబార కార్యాలయం ఖండించింది.

china-denies-rajasingh-comments-about-carona-virus
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన చైనా
author img

By

Published : Apr 11, 2020, 7:34 PM IST

ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 5న హైదరాబాద్​లోని ధూల్‌పేటలో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి.. ‘చైనీస్‌ వైరస్‌ గో బ్యాక్‌’ అంటూ చేసిన నినాదాలపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. భారత్‌లోని పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా కౌన్సిలర్‌ (పార్లమెంట్‌) లియూ బింగ్‌... రాజాసింగ్‌కు లేఖ రాశారు.

కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి నివేదించిన తొలిదేశం చైనా... అంటే దీని అర్థం ఈ వైరస్‌ చైనా నుంచి ఉద్భవించిందని కాదన్నారు. చైనీస్‌ వైరస్‌ గో బ్యాక్‌ అని చేసిన నినాదాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. చైనా రాయబార కార్యాలయం ఖండనపై రాజాసింగ్‌ ప్రతిస్పందించారు. ‘అమెరికా అధ్యక్షుడు సైతం ఇది కరోనా వైరస్‌ కాదు.. చైనా వైరస్‌ అని పేర్కొన్న విషయం నిజంకాదా?’ అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా జస్టిస్ కనగరాజు నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.