ETV Bharat / city

CHANDRBABU LETTERS: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి.. రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖలు

author img

By

Published : Oct 20, 2021, 9:02 PM IST

Updated : Oct 21, 2021, 4:57 AM IST

చంద్రబాబు
చంద్రబాబు

20:55 October 20

రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖలు

      రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని, శాంతి భద్రతలు దిగజారాయని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతోపాటు జరుగుతున్న సంఘటనలపై సీబీఐతో విచారణ చేయించాలంటూ బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయన లేఖలు(chandrababu letterst on attack) రాశారు. ‘తెదేపా కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతోపాటు రాజకీయ పార్టీలు, మీడియాపై దాడులు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదమే. దాడులకు పాల్పడే వారితో పోలీసులు లాలూచీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచే మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయని గుజరాత్‌, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పోలీసులు ధ్రువీకరించారు. గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో 3 టన్నుల హెరాయిన్‌ పట్టుబడితే.. దాని దిగుమతి సంస్థ విజయవాడ చిరునామాతో నమోదైంది. మీరు జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించి ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలను పరిరక్షించాలి. మూకుమ్మడి దాడుల వెనక కుట్రపై సీబీఐ విచారణ చేయించాలి. తెదేపా కార్యాలయాలు, ముఖ్య నేతల ఇళ్లకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి’ అని కోరారు. 

ఇదీ చదవండి:

 Minister Kodali Nani: తెదేపా కార్యాలయంపై దాడి చంద్రబాబు పనే: మంత్రి కొడాలి నాని

Last Updated : Oct 21, 2021, 4:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.