తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం బొప్పూడి బయలుదేరి వెళ్లారు. తొలిరోజు నాలుగు నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు చైతన్య యాత్రలు నిర్వహించనున్నారు. తొమ్మిది నెలల వైకాపా పాలనలో నవమోసాలు, నవ భారాలే ప్రజలకు దక్కాయని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. వైకాపా ప్రజా కంటక పాలనతో పాటు మూడు రాజధానుల అంశం, అమరావతిపై జగన్ తీరును జనంలోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా తెదేపా నేతలు ముందుకు సాగుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చైతన్య యాత్రల ద్వారా పార్టీ యంత్రాంగాన్నీ తెదేపా సమాయత్తం చేయనుంది. ఈ యాత్ర విజయవంతం కావాలని చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని కొబ్బరికాయలు కొట్టారు.
ఇవీ చదవండి: