ETV Bharat / city

రాష్ట్రంలో మతిలేని పాలన సాగుతోంది: చంద్రబాబు - వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు

రాష్ట్రంలో వైకాపా మతిలేని పాలన సాగిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో విధ్వంసం చేయడం, సంక్షేమ పథకాలను కొంతమందికే వర్తించడం, ఇసుక, మద్యంలో అవినీతికి పాల్పడడం వంటివి అందుకు నిదర్శనాలని అన్నారు.

chandrababu
చంద్రబాబు
author img

By

Published : Nov 25, 2020, 8:49 PM IST

కేంద్రం మెడలు వంచుతామన్న వైకాపా మెడలే వంగాయి తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కాకినాడ పార్లమెంట్ తెదేపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో వైకాపా నేతలు వాళ్ల అవినీతి అక్రమాలను వాళ్లే బయట పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

వైకాపాకు చెందిన ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే దుర్భాషలాడుకున్న తీరు ప్రజలంతా చూశారని చంద్రబాబు అన్నారు. అవినీతి సంపాదనలో వాటాల కోసం విశాఖలో, తాడికొండలో వైకాపా ఎంపీ, ఎమ్మెల్యేలు కొట్టుకుంటుంటే సీఎం జగన్ వారిని పిలిపించి పులివెందుల పంచాయితీలతో రాజీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ‘మతిలేని పాలన సాగుతోందని.. ఇతర రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తుల వ్యాఖ్యలు వైకాపా దుశ్చర్యలకు అద్దం పడుతున్నాయని ధ్వజమెత్తారు.

అమరావతిలో పనులు పూర్తిచేయకుండా 3 రాజధానుల పేరుతో విధ్వంసం చేయడం మతిలేని పాలన కాక మరేంటని మండిపడ్డారు. 20 మందికే సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చి 80 మందికి ఎగ్గొట్టడం.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యకాండలన్నీ మతిలేని పాలనకు నిదర్శనాలేనని ఆక్షేపించారు. ప్రతిచోటా వైకాపా గ్యాంబ్లింగ్ బ్యాచ్ పేట్రేగిపోతోందన్న చంద్రబాబు.. ఎమ్మెల్యేలు, మంత్రులే పేకాట దందాలు చేస్తూ వాటాల కోసం రోడ్డెక్కి కొట్లాటలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఇసుకలో, మద్యంలో, వాటాల కోసం అనేక పాట్లు పడుతున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి..

' తుపాను తీరం దాటే వరకు ప్రజలు బయటికి రావొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.