మానవత్వంతో ప్రతి ఒక్కరూ ఐక్యంగా నీటిని ఆదా చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నీటి కొరత కలవరపెడుతోందన్న ఆయన..., నీటి కొరతను ఎదుర్కొనే సవాళ్లు ఉన్నప్పుడే నీటి ఆదా గురించి మాట్లాడటం సబబు కాదని ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఏలూరు లాంటి ఘటనలు పరిశుభ్రమైన నీటి అవసరాలకు ఓ మేలుకొల్పు కావాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన నీరు పొందటం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కని అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పరిశుభ్రమైన నీటిని ప్రమోట్ చేసేందుకు అంతా ఐక్యం కావాలని లోకేశ్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: 'ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను వేధింపులకు గురిచేయడం బాధాకరం'