ETV Bharat / city

నేడు విజయవాడలో చంద్రబాబు పర్యటన - చంద్రబాబు పర్యటన తాజా వార్తలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. నేడు విజయవాడలో పర్యటించనున్నారు. నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

chandrababu tour
చంద్రబాబు పర్యటన
author img

By

Published : Mar 7, 2021, 4:49 AM IST

Updated : Mar 7, 2021, 8:28 AM IST

నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం విజయవాడలో పర్యటించనున్నారు. మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రారంభమై తూర్పు, మధ్య నియోజకవర్గాలలో కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో తెదేపా, సీపీఐ పొత్తుకుదుర్చుకున్నాయి ఒక డివిజనులో మాత్రం జనసేనతో అవగాహన ఏర్పరుచుకుంది. పశ్చిమ నియోజకవర్గంలో సీపీఐ పోటీ చేస్తోంది.

చంద్రబాబు పర్యటనలో సీపీఐ నేతలు పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు భవానీపురం నుంచి పర్యటన ప్రారంభం కానుంది. ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు రోడ్‌మ్యాప్‌ రూపొందించారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విజయవాడ తెదేపాలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కేశినేని నానిపై నేతలు ధ్వజమెత్తారు. తమకు తెలియకుండానే చంద్రబాబు పర్యటన రోడ్‌మ్యాప్‌ తయారు చేశారని బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని ఉంటే తాము చంద్రబాబు పర్యటనలోనూ పాల్గొనబోమని భీష్మించారు.

గతంలోనూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు మధ్య విభేదాలు వచ్చాయి. తర్వాత మళ్లీ సర్దుబాటు చేసుకున్నారు. కేశినేనిభవన్‌కు వెళ్లి బుద్దా సమావేశంలో పాల్గొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా టిక్కెట్ల కేటాయింపుల్లో తేడా వచ్చింది. దీనిపై చంద్రబాబు ఇద్దరిని పిలిచి మాట్లాడారు. చంద్రబాబు చెబితే సరి అన్న బుద్దా వెంకన్న తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన వివరాలు తెలపలేదని మళ్లీ విభేదించారు. ఈసారి బొండా ఉమా జతకలిసి మీడియాకు ఎక్కడం విశేషం. మీడియా సమావేశం పెట్టిన రెండు గంటల్లోనే వివాదం సద్దుమణిగింది. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఇంటికి మేయరు అభ్యర్థిని, ఎంపీ కూతురు కేశినేని శ్వేత వెళ్లారు. అంతకు ముందు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, టీడీ జనార్దన్‌ ఫోన్లో మాట్లాడారు. నాయకులను సముదాయించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

రోడ్డు షో ఇలా..!

చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గం స్వాతి సెంటర్‌ నుంచి ప్రారంభమై కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్‌, సితార సర్కిల్‌, సొరంగం రోడ్డు, చిట్టినగర్‌ సెంటర్‌, కేబీఎన్‌ కళాశాల రోడ్డు, నెహ్రూచౌక్‌, పంజాసెంటర్‌, వించిపేట, ఎర్రకట్ట, పాత ఆర్‌ఆర్‌పేట, న్యూ ఆర్‌ఆర్‌పేట, సింగ్‌నగర్‌ పెట్రోల్‌ బంకు, పైపులరోడ్డు, నున్న పోలీసు స్టేషన్‌, ప్రకాష్‌నగర్‌ మెయిన్‌రోడ్డు, రాజీవ్‌నగర్‌, కండ్రిక, సింగ్‌నగర్‌ పైవంతెన, అల్లూరి విగ్రహం, గవర్నమెంట్‌ ప్రెస్‌, బీఆర్‌టీఎస్‌ రోడ్డు, మోడ్రన్‌ సూపర్‌మార్కెట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ చుట్టుగుంట, మెట్రో, సిద్ధార్థ కళాశాల, అమ్మ కల్యాణమండపం, రమేష్‌ ఆసుపత్రి, గురునానక్‌కాలనీ రోడ్డు, పటమట రైతుబజార్‌, ఆటోనగర్‌ గేట్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌, బెంజిసర్కిల్‌, స్క్రూబ్రిడ్జి, బాలాజీనగర్‌, రాణిగారితోట, సత్యంగారి హోటల్‌ కృష్ణలంక వరకు చేరుకుంటుంది.

ఇదీ చూడండి:

విశాఖ ఎన్నికలు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలవాలి: చంద్రబాబు

Last Updated : Mar 7, 2021, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.