CBN REVIEW WITH INCHARGES : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం ఇంఛార్జ్‌గా ఎరిక్షన్ బాబును కొనసాగిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఎరిక్షన్ బాబుకు సహకరించాలని పార్టీ నియోజకవర్గ నేత మన్నె రవీంద్రకు సూచించారు. పార్టీలో అందరినీ కలుపుకుని పని చేయాలని ఎరిక్షన్ బాబుకు అధినేత దిశానిర్దేశం చేశారు. ఇప్పటి వరకు 71 మంది నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఇవాళ విజయవాడ తూర్పు, చీపురుపల్లి, రాయదుర్గం, సాలూరు, మచిలీపట్నం, యర్రగొండపాలెం నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలకు గద్దె రామ్మోహన్, కిమిడి నాగార్జున, కాలువ శ్రీనివాసులు, గుమ్మడి సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, ఎరిక్షన్‌బాబులు హాజరయ్యారు.
ఇవీ చదవండి: