ETV Bharat / city

TDP Sadhana Deeksha: నేడు తెదేపా 'సాధన దీక్ష'.. పాల్గొననున్న చంద్రబాబు - chandrababu news

కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ తెలుగుదేశం పోరు ఉద్ధృతం చేసింది. నేడు అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి 'సాధన దీక్ష' పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. బాధితులందరికీ పరిహారం చెల్లించాలనే డిమాండ్‌తో తెలుగుదేశం శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగనున్నారు. దీనిపై నేతలతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వం ఇస్తున్న అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP Sadhana Deeksha
తెదేపా 'సాధన దీక్ష'
author img

By

Published : Jun 28, 2021, 4:21 PM IST

Updated : Jun 29, 2021, 7:22 AM IST

కరోనా బాధితుల్ని రాష్ట్రప్రభుత్వం ఆదుకోవాలంటూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్‌లో 'సాధన దీక్ష' పేరిట నిరసన కార్యక్రమం జరగనుంది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వటంతో పాటు కరోనాతో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 10లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన బాధిత కుటుంబాలకు 25 లక్షలు.. ఫ్రంట్లైన్ వారియర్ కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. చంద్రబాబుతో పాటు 175 నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిరసనలు కొనసాగించనున్నారు. కరోనా కొనసాగినంతకాలం పేదలకు నెలకు రూ. 7,500 అందించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

"అధినేత చంద్రబాబుతో పాటు మరో 15 మంది సీనియర్ నేతలు ఎన్టీఆర్​ భవన్‌లో జరిగే నిరసన దీక్షలో పాల్గొంటారు. అదే సమయంలో 175 నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నేతలు నిరసనలు చేపడతారు." - అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

కోవిడ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఈనెల 16 నుంచి తెలుగుదేశం ఆందోళనలు చేస్తోంది. ప్రభుత్వం స్పందించకపోవడంతో.. తెదేపా నేతలు, శ్రేణులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా.. 'సాధన దీక్ష' పేరిట ప్రత్యక్ష నిరసనలకు దిగారు.

అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో ప్రజలెలా ఉంటారు..?

అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు నిన్న వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

"ఇసుక, సిమెంట్​ను సొమ్ము చేసుకుంటూ వైకాపా నేతలు అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు పేదలకు నిర్మిస్తున్నారు. పేదలకు సిమెంట్, ఇసుక ఇచ్చి ఇళ్లు కట్టుకోమంటే సరిపోతుందా ?. ప్రభుత్వ గృహనిర్మాణాన్ని సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు. భూ సేకరణలో రూ.6500 కోట్లు దోచి, మౌలిక వసతుల పేరిట రూ.34 వేలకోట్ల మరో అవినీతికి తెర లేపారు. టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. గృహనిర్మాణ బకాయిల్ని తక్షణమే విడుదల చేయటంతో పాటు నివాసయోగ్యమైన గృహాలను నిర్మించాలి. విద్యార్థులకు ఉపకారవేతనాలను తెదేపా ప్రభుత్వం అందిస్తే..వైకాపా ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేయటంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను 2.47 కోట్ల నుంచి 60 లక్షలకు కుదించింది. కరోనాతో కుటుంబాల ఆదాయం తలకిందులైతే ధరల పెంచి ప్రజలపై పన్నుల భారం మోపారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని జగన్ రెడ్డి నిలబెట్టుకోవాలి." -తెలుగుదేశం పార్టీ నేతలు

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థిసంఘాల ధర్నా.. మంత్రుల నివాసాలు ముట్టడికి యత్నం

Last Updated : Jun 29, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.