ఇదీ చదవండి : వెలవెలబోయిన తెలుగు తల్లి విగ్రహం
'తెలుగుతల్లికి మల్లెపూదండ కరవైందా ?' - telugu talli statue
తెలుగు భాషాదినోత్సవానికి రూ.18 లక్షలు విడుదల చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహం కనిపించలేదా అని చంద్రబాబు ఆక్షేపించారు. ఆ విగ్రహానికి కనీసం ఒక్క పూలమాల వేసే ప్రజాప్రతినిధే కరవయ్యాడని విమర్శించారు. ఇదేనా తెలుగుతల్లికి మీరిచ్చే గౌరవం అని ప్రశ్నించారు.
'తెలుగుతల్లికి మల్లెపూదండ కరవైందా ?'
తెలుగు భాషాదినోత్సవానికి ప్రభుత్వం విడుదల చేసిన 18 లక్షల రూపాయలతో ఏం చేసినట్టని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. తెలుగు భాషాదినోత్సవం రోజున, విజయవాడ నడిబొడ్డున ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి కనీసం పూలమాల వేసేవారు కూడా లేరంటే, ఈ ప్రభుత్వం తెలుగు భాషకు ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు. "మా తెలుగుతల్లికి మల్లెపూదండా.." అంటూ ఆంధ్రులు గర్వంగా పాడుకునే రాష్ట్ర గీతం... ఈ మూడు నెలల్లో ఒక్క అధికారిక కార్యక్రమంలో అయినా వినిపించిందా అని ప్రశ్నించారు. ఏమిటీ రాష్ట్ర దౌర్భాగ్యమని ఆక్షేపించిన చంద్రబాబు... తెలుగు భాషాదినోత్సవానికి 18 లక్షల రూపాయలు విడుదల చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి : వెలవెలబోయిన తెలుగు తల్లి విగ్రహం
Intro:a
Body:a
Conclusion:a
Body:a
Conclusion:a