మౌలానా జయంతి రోజున మైనారిటీల హక్కుల సంరంక్షణ కోసం, ఆశయాల సాధనకు పునరంకితమవుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. జాతీయోద్యమ కాలంలోనే మతతత్వాన్ని వ్యతిరేకించి, లౌకికవాద ఆవశ్యకతను చాటి చెప్పిన జాతీయోద్యమ నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. భారతదేశ తొలి విద్యా మంత్రిగా సాహిత్యం, విద్యా వికాసాల కోసం కృషి చేసిన అబుల్ కలాం రాజ్యాంగ రచనలోనూ పాలు పంచుకున్నారన్న చంద్రబాబు ప్రజలందరికీ స్వేచ్ఛాయుత జీవనం, ధన, మాన, ప్రాణ సంరక్షణ సాధించినప్పుడే ఆజాద్ ఆశయాలకు సాఫల్యత అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: క్రికెట్ బెట్టింగ్లో నష్టం..ఇద్దరి ఆత్మహత్యాయత్నం.. ఒకరు మృతి