అసెంబ్లీ రద్దు సవాల్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు నేతలకు సూచించారు. గిరిజన ఆడబిడ్డలపై గ్యాంగ్ రేప్‌లపై ధ్వజమెత్తాలన్నారు. కల్తీ మద్యం, శానిటైజర్ తాగి అనేకమంది చనిపోవడంపై నిరసన తెలపాలని దిశానిర్దేశం చేశారు. రాజధాని 3ముక్కల అంశం అజెండాగా.. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేయాలన్నారు. 48గంటల్లో స్పందించాలని ఛాలెంజ్ చేసినా సీఎం జగన్‌లో కదలిక లేదని నేతలు చంద్రబాబుకు వివరించారు. 13జిల్లాలలో వైకాపా బాధిత ప్రజానీకం పెరిగిపోయిందని ఎమ్మెల్సీలు తెలిపారు. ఓటమి భయంతోనే సవాల్‌కు స్పందించడం లేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. రాజధాని 3ముక్కల అంశాన్ని కావాలనే ఎన్నికల ముందు దాచిపెట్టారని..., ఎన్నికల్లో నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇది 5 కోట్ల ప్రజలకు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్ కో