ETV Bharat / city

'బెదిరింపు ధోరణి.. ప్రజా వ్యతిరేక విధానాలు.. వైకాపా ఆటవిక రాజ్యం' - 'నాలుగు రోజుల్లో ముగ్గురు మంత్రులపై తప్పుడు కేసులు'

తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్​తో సమావేశమై..వైకాపా అరాచకాలపై ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల్లో ముగ్గురు బీసి మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టడంతోపాటు, వైకాపా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. సుమారు గంట పది నిమిషాల పాటు చంద్రబాబు గవర్నర్​తో చర్చించారు.

'నాలుగు రోజుల్లో ముగ్గురు మంత్రులపై తప్పుడు కేసులు'

author img

By

Published : Jun 18, 2020, 6:43 PM IST

Updated : Jun 19, 2020, 3:16 AM IST

'వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్చిన్నం చేస్తోంది. నాలుగు రోజుల్లో ముగ్గురు బీసీ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెట్టడంతోపాటు.. ఏడాదిలోనే అనేక కుంభకోణాలకు పాల్పడింది. వైకాపా పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోంది'. అని తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. గురువారం ఆయన.. సుమారు గంట పది నిమిషాల పాటు గవర్నర్​తో భేటీ అయ్యారు. ఆయా అంశాలకు సంబంధించి వివిధ ఘటనలు ప్రస్తావిస్తూ ఫిర్యాదును అందించారు.

ఫిర్యాదులో అంశాలివే..

  • ప్రభుత్వం అనుసరిస్తోన్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై సుప్రీంకోర్డు, హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేశాయి. అయినా సరే అధికార పక్షం తానిచ్చిన ఆదేశాలనే చిన్న చిన్న సవరణలతో యథాతథంగా అణలు చేయాలని చూసింది.
  • తెదేపా నేతలు, కార్యకర్తలపై మానసిక, ఆర్థిక, భౌతిక దాడులకు పాల్పడుతోంది. తప్పుడు కేసులతో వేధిస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. అధికార పార్టీ నేతల అరాచకాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.
  • స్థానిక ఎన్నికల సమయంలో అధికార పార్టీ చేసిన అరాచకాలపై అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ప్రజలను గ్రామాల నుంచి తరిమేశారు. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులను హతమార్చారు. ప్రభుత్వ యంత్రాంగమే పలుచోట్ల హింసాత్మక చర్యలకు పాల్పడింది.
  • 185 రోజులుగా ఉద్యమం చేస్తోన్న అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు. వైకాపా నాయకులు లాక్​డౌన్​ నిబంధనలు పాటించకుండా ర్యాలీలు, సంబరాలు చేసుకుని.. కరోనా వ్యాప్తికి కారణమయ్యారు.
  • శాసన, పాలన, న్యాయ, మీడియా వ్యవస్థలను వైకాపా ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోంది. అసెంబ్లీ, మండలిలో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. అనుకూలంగా ఉన్న అధికారులకు పోస్టింగులు.. అడ్డుచెప్పేవారికి ఉద్వాసన పలుకుతున్నారు. న్యాయమూర్తులను విమర్శించడం, కోర్టు తీర్పులను అమలు చేయకపోవడం, మీడియాపై దాడులు వంటివి నిత్యకృత్యాలయ్యాయి.
  • వైకాపా వేధింపులకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లొంగిపోయారు. వారి ప్రలోభాలకు లొంగలేదని అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఒక బీసీ నేత ఫోటోని కార్యాలయం నుంచి ఎందుకు తీసేశారని అడిగిన పాపానికి అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారు. నాలుగు రోజుల్లో ముగ్గురు బీసీ నేతలను అరెస్టు చేశారు. ఆరుగురిపై కేసులు పెట్టారు.
  • రీచ్​ల నుంచి 12 లక్షల టన్నుల ఇసుకను మాయం చేశారు. రూ.20 వేల ఇసుక లారీని రూ.40 వేలకు అమ్ముతున్నారని.. వైకాపా ఎమ్మెల్యేలే చెబుతున్నారు. ఎస్సీల అసైన్డ్​ భూములను బలవంతంగా లాక్కున్నారు. ఇళ్ల పట్టాల కోసం జరిపిన భూ సేకరణలో రూ.1,400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.

ఇదీ చూడండి..

రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల పోలింగ్​

Last Updated : Jun 19, 2020, 3:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.