ETV Bharat / city

"అల్లూరి విగ్రహాన్ని అక్కడా ప్రతిష్టించండి".. చంద్రబాబు లేఖ - పార్లమెంట్​లో అల్లూరి విగ్రహాన్ని అవిష్కరించాలని ప్రధానికి చంద్రబాబు లేఖ

CBN Letter to PM Modi: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని కీర్తించుకోవడం సంతోషకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లాకు లేఖల రాసిన చంద్రబాబు.. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్​లోనూ ప్రతిష్ఠించాలని కోరారు.

CBN Letter to PM Modi
CBN Letter to PM Modi
author img

By

Published : Jul 2, 2022, 1:17 PM IST

Chandrababu on Sitarama Raju statue in Parliament: పార్లమెంట్​లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ.. ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లాకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అల్లూరి 125వ జయంతి వేడుకల సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అల్లూరిని స్మరించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్న చంద్రబాబు.. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని చేర్చడం సంతోషకరమన్నారు. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వానికి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. జులై 4న భీమవరంలో ప్రధాని మోదీ చేస్తున్న అల్లూరి విగ్రహావిష్కరణ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతుందన్నారు. అల్లూరి స్వాతంత్య్రోద్యమ స్పూర్తికి.. త్యాగానికి.. ధైర్యసాహసాలకు నిలువుటద్దమన్నారు.

తెదేపా నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్​ హాల్లో ఏర్పాటు చేయాలని 13వ లోక్‌సభలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో విగ్రహ ప్రతిష్ఠాపనలో జాప్యం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా జాప్యం లేకుండా అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు. అల్లూరిని సత్కరించుకోవడం అంటే దేశ స్ఫూర్తి, మన గిరిజన జాతులను గౌరవించుకోవడమేనని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

ఇదీచదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.