ETV Bharat / city

'జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైంది'.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యం విషయమై తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్​కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నిర్వీర్యమైనట్లుందని.., గ్రూప్‌-1 ఎంపిక తీరుపట్ల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు.

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
author img

By

Published : Jun 13, 2022, 5:37 PM IST

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యం, గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్ధుల ఎంపికలో అవకతవకలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. నిరుద్యోగ యువత కలలు, లక్ష్యాలను సాకారం చేయాల్సిన ఏపీపీఎస్సీ నిర్వీర్యమైందని విమర్శించారు. ప్రతి ఏడాది జనవరిలో క్రమం తప్పకుండా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్న ప్రభుత్వ హామీ అమలవుతుందని యువత మూడేళ్లగా ఎదురు చూస్తున్నా.. ఫలితం శూన్యమని మండిపడ్డారు. గ్రూప్‌-1 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయటంలో ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న తీరు అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన, ఆవేదనను కలుగజేస్తోందని ధ్వజమెత్తారు. 2018లో ప్రకటించిన 165 గ్రూప్‌-1 ఉద్యోగాలకు డిసెంబర్‌ 2019లో వ్రాత పరీక్షలు జరిపి మే 2021లో ఫలితాలు ప్రకటించారని గుర్తుచేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీల ప్రకటన నుంచి ఫలితాల విడుదల వరకు అడుగడుగునా అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

మెయిన్స్‌ పరీక్షల తేదీలను ఐదుసార్లు మార్చారని.., పరీక్షా పత్రాల మూల్యాంకనం తప్పుడు తడకగా జరిగిందని చంద్రబాబు విమర్శించారు. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు కార్యదర్శి, కమిషన్‌ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని అభ్యర్థులు భావిస్తున్నారన్నారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటి మూల్యాంకనానికి, రెండవ మూల్యాంకనానికి ఫలితాల్లో 15 శాతం తేడా లేనప్పుడు మూడవ మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. తమ అస్మదీయులను అందలం ఎక్కించటం కోసం గ్రూప్‌-1 మెయిన్స్‌లో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. మొదటిసారి విడుదల చేసిన ఫలితాలకు రెండవసారి విడుదల చేసిన ఫలితాలకు భారీ వ్యత్యాసాలు ఉండటంతో అభ్యర్దులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. గతంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపికలో సైతం అక్రమాలు జరిగినట్టు పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవటంతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీఎం జగన్​కు రాసిన లేఖలో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.