శ్రీకాకుళం జిల్లాకు చెందిన వీర జవాన్ ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు చంద్రబాబు లేఖ రాశారు. 17 ఏళ్లకు పైగా సైన్యంలో సేవలందించిన ఉమామహేశ్వరరావు గతేడాది జులైలో లద్దాక్‌లో జరిగిన ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యులు.. అధికారులు చుట్టూ తిరిగినా.. రాష్ట్రం నుంచి అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదన్నారు. తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా చంద్రబాబు కోరారు. ఇద్దరు ఆడపిల్లలతో.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వీర జవాన్ ఉమామహేశ్వరరావు భార్య తెలిపారు.

ఇదీ చదవండి:
CHANDRABABU: 'వైకాపా నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు చాలవు'