ETV Bharat / city

ఆయనది హోల్​సేల్ దోపిడీ అయితే.. వారిది చిల్లర దోపిడీ: చంద్రబాబు - వైకాపాపై చంద్రబాబు ఫైర్

ముఖ్యమంత్రి జగన్ హోల్​సేల్​గా రాష్ట్రాన్ని దోచుకుంటే.. మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దోపిడీలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వాలంటీర్ల కోసం ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్​లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని మండిపడ్డారు. రూ.26 వేల కోట్ల నరేగా నిధులు వచ్చినా.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సర్పంచ్​లకు చంద్రబాబు సూచించారు.

యనది హోల్​సేల్ దోపిడి అయితే.. వారిది చిల్లర దోపిడి

author img

By

Published : Feb 18, 2022, 7:46 PM IST

ఆయనది హోల్​సేల్ దోపిడి అయితే.. వారిది చిల్లర దోపిడి

చెత్త పన్నుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సర్పంచులున్న ప్రతిచోట తీర్మానాలు చేస్తే.. వైకాపా సర్పంచులపై ఒత్తిడి పెరిగి వారి మద్దతు కూడా లభిస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి తెదేపా తరపున గెలుపొందిన సర్పంచ్​లతో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ఆయన సమావేశం నిర్వహించారు. పంచాయతీ నుంచి పంచాయతీకి రోడ్లు వేయలేని జగన్ రెడ్డి.. పల్లెవెలుగు విమానాలు నడుపుతానంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

వాలంటీర్ల కోసం ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్​లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని మండిపడ్డారు. రూ.26 వేల కోట్ల నరేగా నిధులు వచ్చినా.. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్​లదేనని అన్నారు. భారతీ సిమెంట్ లాభాల కోసం సిమెంట్ ధరలు పెంచి నిర్మాణ వ్యయం పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని స్థానిక ప్రజాప్రతినిధులకు చంద్రబాబు సూచించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు పంచాయతీలకు ఇవ్వకుంటే దిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేయాలని.., ఆ దిశగా పార్టీ తరఫున కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో సర్పంచులదే కీలక పాత్ర అని..,అలాంటిది వారికి నిధులు ఇవ్వకుండా తెదేపా హయాంలో కట్టించిన భవనాలకు రంగులేసుకోవడంతోనే వైకాపా పాలన సరిపోతోందని ధ్వజమెత్తారు. "ఎన్నికల ముందు జగన్ ముద్దులు పెట్టారు. ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు" అని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిన ప్రభుత్వం.. జెన్​కో ఉద్యోగులకు జీతాలివ్వలేకపోతుందని విమర్శించారు. సీఎం జగన్ హోల్​సేల్​గా రాష్ట్రాన్ని దోచుకుంటే..మిగిలిన అధికార పార్టీ నేతలు చిల్లర దోపిడీలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

"వాలంటీర్ల కోసం సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఏపీకి రూ.26 వేల కోట్ల నరేగా నిధులు వచ్చినా అభివృద్ధి లేదు. నరేగా పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని రుజువైంది. చెత్తపన్నుకు వ్యతిరేకంగా పంచాయతీల్లో తీర్మానం చేయాలి. పంచాయతీలకు రావాల్సిన నిధులు ఇవ్వాలని గట్టిగా అడగాలి." - చంద్రబాబు

అవాస్తవాలను వేగంగా ప్రచారం చేయటంలో జగన్ రెడ్డిని మించిన వాళ్లు లేరనేందుకు వివేకా హత్యే ఓ ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హత్యా రాజకీయాలతో రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వొద్దని వైఎస్ వివేకా అన్నందుకు కక్ష కట్టారని ఆరోపించారు. పరిటాల రవి హంతకులను ఒక్కొక్కర్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే హత్య రాజకీయాలు చేస్తే ఎలా? అని చంద్రబాబు నిలదీశారు.

ఇదీ చదవండి

జగన్​మోహన్ రెడ్డి చేతకానితనంతోనే.. ఏపీలో ఆర్దిక సంక్షోభం: యనమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.