తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్టును చంద్రబాబు ఖండించారు. ప్రతికారేచ్ఛతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తెదేపా చేస్తున్న పోరాటాల్ని సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఏడాది వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే... అరెస్టులు చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్ జైలుకు వెళ్లారన్న కక్షతోనే తెదేపా నాయకులను జైళ్లకు పంపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కక్షసాధింపుతో తెదేపాను ప్రజల నుంచి దూరం చేయలేరని.... రెట్టించిన బలంతో ప్రజా సమస్యలపై పోరాడతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలో వైకాపా ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతామని హెచ్చరించారు. ప్రజల అండదండలే తెదేపా నేతలకు ఆశీస్సులుగా ఉంటాయన్నారు. జగన్ కక్షసాధింపు చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
'ఆయన జైలుకు వెళ్లారనే.. ఇతరులనూ పంపుతున్నారు'
తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. జగన్ జైలుకు వెళ్లారన్న కక్షతోనే తెదేపా నాయకులను జైళ్లకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఏడాది వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే... అరెస్టులు చేస్తున్నారని ఆక్షేపించారు.
తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి అరెస్టును చంద్రబాబు ఖండించారు. ప్రతికారేచ్ఛతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రగిలిపోతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై తెదేపా చేస్తున్న పోరాటాల్ని సీఎం జగన్ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఏడాది వైఫల్యాలపై ప్రజల దృష్టి మరల్చేందుకే... అరెస్టులు చేస్తున్నారని ఆక్షేపించారు. జగన్ జైలుకు వెళ్లారన్న కక్షతోనే తెదేపా నాయకులను జైళ్లకు పంపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కక్షసాధింపుతో తెదేపాను ప్రజల నుంచి దూరం చేయలేరని.... రెట్టించిన బలంతో ప్రజా సమస్యలపై పోరాడతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలో వైకాపా ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతామని హెచ్చరించారు. ప్రజల అండదండలే తెదేపా నేతలకు ఆశీస్సులుగా ఉంటాయన్నారు. జగన్ కక్షసాధింపు చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్