ETV Bharat / city

Chandrababu comments: 3 టాయిలెట్లు కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా?- చంద్రబాబు - సీఎం జగన్​పై చంద్రబాబు కామెంట్స్​

Chandrababu comments: సీపీఎస్‌ రద్దుపై జగన్ హామీ ఏమైందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో కొందరు పేటియం బ్యాచ్​లా తయారయ్యారని ఆరోపించారు.

chandrababu
chandrababu
author img

By

Published : Dec 15, 2021, 4:46 PM IST

Updated : Dec 15, 2021, 7:38 PM IST

Chandrababu comments: సీపీఎస్‌ రద్దుపై జగన్ హామీ ఏమైందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. హామీ నెరవేర్చని జగన్ ఇప్పుడేం చెబుతారన్నారు. కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లిలా జగన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.

రెండున్నరేళ్లలో రాష్ట్రాన్ని దారుణంగా ధ్వంసం చేశారని మండిపడ్డారు. 3 టాయిలెట్లు కూడా కట్టలేని జగన్ 3 రాజధానులు కడతారా? అని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం దిల్లీలో బిచ్చం ఎత్తుకుంటోందని తీవ్రంగా మండిపడ్డారు. ఆర్థిక కష్టాల నుంచి కాపాడాలని కేంద్రాన్ని ప్రాధేయపడుతున్న వైకాపా సర్కార్​.. రాష్ట్రహోదా, అమరావతి, పోలవరం గురించి అడగడం లేదా? అని దుమ్మెత్తి పోశారు.

రాష్ట్రంలో కొందరు వైకాపా సర్కారుకు పేటియం బ్యాచ్​లా తయారయ్యారని సంచలన ఆరోపణలు చేశారు.

" ఒక జడ్జి ఆంధ్రప్రదేశ్​కు వచ్చి ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని అంటున్నారు. రాష్ట్రంలోని దారుణ పరిస్థితులు ఈ జడ్జిలకు పట్టవా?. రాష్ట్రంలో కొన్ని పే టీమ్ బ్యాచ్‌లు తయారయ్యాయి. ఆత్మహత్యలు, అల్లకల్లోలాలు ఆ జడ్జిలకు కనపడవా! ఒక నేరస్థుడికి ఇలాంటివారు మద్దతు ఇవ్వవచ్చా!" -చంద్రబాబు, తెదేపా అధినేత

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఉద్దేశించీ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. "ఒకాయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. కుమారుడికి పదవి తీసుకుని జగన్‌ను పొగుడుతున్నారు" అని చంద్రబాబు విమర్శించారు. రిటైర్‌ అయ్యాక వీరికి( ఈ మాజీ జడ్జీలకు) పదవులు కావాలని, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.

తెదేపాలో చేరిన మాజీ ఐపీఎస్

అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి శేక్షావలి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. చంద్రబాబు శేక్షావలికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే విధంగా పలువురు ముస్లింలు కూడా పసుపు కండువా కప్పుకున్నారు. రాష్ట్రానికి తలమానికమైన అమరావతి, పోలవరాన్ని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.

ఇదీ చదవండి: Chandrababu letter to DGP: 'తిక్కారెడ్డికి ఏం జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యత'

Last Updated : Dec 15, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.