ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలంటే.. వైకాపా పారిపోతోంది: చంద్రబాబు

నిష్పాక్షిక ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయంతోనే పంచాయతీ ఎన్నికలంటే వైకాపా పారిపోతోందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. నామినేషన్లు స్వీకరించని చోట్ల, అధికారులపై ఫిర్యాదులు చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

పంచాయతీ ఎన్నికలంటే.. వైకాపా పారిపోతోంది: చంద్రబాబు
పంచాయతీ ఎన్నికలంటే.. వైకాపా పారిపోతోంది: చంద్రబాబు
author img

By

Published : Jan 25, 2021, 2:53 PM IST

నామినేషన్లు స్వీకరించని అధికారులపై ఫిర్యాదులు చేయాలని.. ఆ ఫిర్యాదులను గోడలకు అతికించటంతో పాటు పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు ఇవ్వాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఆయా ఫొటోలు, వీడియో సాక్ష్యాధారాలతో ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, జిల్లా పంచాయతీ అధికారులు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని సూచించారు. అధికారుల సహాయ నిరాకరణ, గైర్హాజరుపై రాష్ట్ర గవర్నర్​కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదులు పంపాలన్నారు. regjudaphc@nic.in, governor@ap.nic.in, secy.apsec@gmail.comలకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపాలని శ్రేణులను కోరారు.

ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థని గుర్తు చేసిన చంద్రబాబు.. ఈసీ ఆదేశాలను ధిక్కరించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. వినాశకాలే విపరీత బుద్ధిలా జగన్ రెడ్డి ధోరణి ఉందని ధ్వజమెత్తారు. సైకో, ఉన్మాద మనస్తత్వం ఉన్న జగన్ రెడ్డి చర్యలతో రాష్ట్రం నాశనం అవుతోందని ఆక్షేపించారు. జగన్ రెడ్డి వేధింపులు, బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అన్ని గ్రామాల్లో నామినేషన్లు పడేలా చూడటంతో పాటు బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అభ్యర్థులంతా సంబంధిత ధృవపత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: ఎన్నికల కమిషన్ ఆదేశించినా... కానరాని అధికారులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.